Rayapole Mandal | రాయపోల్ జనవరి 11. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాను సర్పంచుగా గెలుపొందితే తమ స్వగ్రామమైన తిమ్మక్కపల్లి నుంచి కాలినడకన వెళ్లి వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుంటామని సత్తు అశోక్ రెడ్డి మొక్కాడు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామ సర్పంచుగా గెలిచిన సత్తు అశోక్ రెడ్డి యువజన నాయకుడు చింత వెంకటితో కలిసి ఆదివారం ఉదయం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో మొదటగా మొక్కులు చెల్లించాడు. అనంతరం నాచారం దేవస్థానం వరకు పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచు సత్తు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎన్నికలకు ముందు స్వామివారికి మొక్కులు చెల్లించాలని వేడుకున్నామని.. అందుకు అనుగుణంగా తిమ్మక్కపల్లి నుంచి నాచారం దేవస్థానం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామస్తులతోపాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి సర్పంచి గెలిపించిన గ్రామస్తుల రుణం తీర్చుకోలేనిదఃన్నారు.
తనకు చిన్న వయసులో సర్పంచుగా గ్రామస్తులు అవకాశం ఇచ్చారని.. వారి ఆశలను వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం గుర్తింపు, 24 గంటల పాటు అందుబాటులో ఉండి గ్రామస్తుల సేవకు సేవకు అంకితమవుతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసి మండలంలో తిమ్మక్కపల్లి గ్రామపంచాయతీ ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని సత్తు అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం