Rythu Bheema | రాయపోల్, ఆగస్టు 11 : కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని దుబ్బాక వ్యవసాయ శాఖ ఏడీఏ మల్లయ్య రైతులకు సూచించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో రైతులకు ఇస్తున్న దరఖాస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ.. కొత్త పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ ఆగస్టు 13వ తేదీలోపు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. 2025 జూన్ 5వ తేదీ వరకు నూతనంగా పట్టా పాస్ బుక్ వచ్చినవారు దరఖాస్తులకు అర్హులని అన్నారు. రైతు వేదికలో 2025 సంవత్సరానికిగాను రైతు బీమా నమోదు వ్యవసాయ విస్తరణ అధికారులు చేపట్టారు. అలాగే ఇంతకుముందే పట్టా పాస్ బుక్ ఉండి రైతు బీమా నమోదు చేసుకొని 18 నుండి 59 సంవత్సరాలలోపు వయసు గల పట్టాదారులు కూడా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇంతకుముందే రైతు బీమా నమోదు చేసుకున్న రైతులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ఇంతకు ముందు సంవత్సరాల్లో రైతు బీమా నమోదు చేసుకొని ఇప్పుడు మార్పులు చేర్పులు చేసుకోదలచిన రైతులు ఆగస్టు 12వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి మార్పులు చేర్పులు చేసుకోవచ్చునని తెలిపారు.
దరఖాస్తు ఫారంతోపాటు రైతు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రైతు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు, ఏఓ జాదవ్ సాయి కిరణ్, ఏఇఓలు సంతోష్ కుమార్, రజినీకాంత్ పాల్గొన్నారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ