Revenue conferences | మద్దూరు (ధూళిమిట్ట), మే 31 : ఈ నెల 3వ తేది నుంచి 17వ తేదీ వరకు మద్దూరు, ధూళిమిట్ట మండలాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ గపూర్ రహీం, సింహాచలం మదుసూధన్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 3న సలాఖపూర్, ధూళిమిట్ట, 4న ధర్మారం, లక్కపల్లి, లింగాపూర్, 5న మద్దూరు, బెక్కల్, 6న గాగిళ్లాపూర్, రెడ్యానాయక్తండా, 9న వల్లంపట్ల, బైరాన్పల్లి, 10న రేబర్తి, కొండాపూర్, 11న మర్మాముల, దుబ్బతండా, 12న లద్నూర్, హనుమతండా, 13న నర్సాయపల్లి, కూటిగల్, 16న వంగపల్లి, జాలపల్లి, 17న తోర్నాల గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులను జయప్రదం చేయాలని కోరారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత