Ration Rice | గజ్వేల్, జూన్ 16: ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని వర్షాకాలం నేపథ్యంలో ఈ నెల ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యంలో ఎక్కువ శాతం నూకలు ఉండడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. గజ్వేల్ మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో 570 రేషన్ కార్డులున్నాయి. అయితే గ్రామానికి చెందిన డీలర్ లక్ష్మారెడ్డి రేషన్ దుకాణానికి అధికారులు మొదటి విడతలో 150 క్వింటాళ్ల సన్నబియ్యం పంపించారు.
వాటిలో చాలా వరకు బియ్యం బస్తాల్లో తుట్టెలు పట్టి ఉండడంతోపాటు నూకలతో కూడిన దొడ్డు బియ్యం రావడంతో లబ్దిదారులు ఆ బియ్యాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గత 15 రోజులుగా గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా.. తుట్టెలు పట్టి దొడ్డు బియ్యం అందులో నూకలు ఎక్కువ శాతం ఉండడంతో మాకొద్దు ఈ బియ్యం అంటూ వెనుతిరుగుతున్నారు. సుమారుగా 15 బస్తాలు తుట్టెలు, నూకలతో కూడిన దొడ్డు బియ్యం వచ్చాయి.
ఇంకా 80 బస్తాల వరకు పంపిణీ చేయాల్సి ఉండగా.. అందులో కూడా ఇలాంటి బస్తాలు ఉండొచ్చని రేషన్ డీలర్ తెలిపారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడంతో రేషన్ డీలర్లు పంపిణీ చేసే సమయంలో ఇబ్బందులు పడుతుండగా.. లబ్దిదారులు గంటల తరబడి దుకాణాల వద్ద వేచి ఉంటున్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత