Rasamayi balakishan | బెజ్జంకి, మార్చి 24 : అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన కల్లూరి రమేశ్, రాంసాగర్‌కు చెందిన అడుకని రమేశ్, రవి, వడిజే కనుకయ్యలకు చెందిన మొక్కజొన్న పంట అకాల వర్షంతో పూర్తిగా దెబ్బతినడంతో వాటిని ఇవాళ ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రసమయ బాలకిషన్ మాట్లాడుతూ.. అకాల వర్షంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర దుఖంలో ఉండగా.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనీసం పంటలను పరిశీలించి, రైతులకు మనోధైర్యం కల్పించడంలో విఫలమయ్యరన్నారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ చేస్తామని ప్రకటించి రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా ముంచారన్నారు.
నియోజక వర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వెంటనే పరిహారం అందించాలని కోరారు. అనంతరం రసమయి బాలకిషన్ బేగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మామిడాల లక్ష్మణ్ ఇటీవల మరణించగా.. అతని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్‌గుప్తా, బండి రమేశ్, ఎల శేఖర్‌బాబు, నరేశ్, మల్లేశం, మహేశ్, రాములు, తిరుపతి, శంకర్, రమేశ్, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, తిరుపతిరెడ్డి, స్వామి, కిష్టయ్య, పర్శరాములు తదితరులున్నారు.