Sathya Saibaba | గజ్వేల్, నవంబర్ 23 : సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా కర్బుజా కాయపై సాయి బాబా చిత్రాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపకులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అద్భుతంగా చిత్రించి సాయిబాబా ఆలయ నిర్వాహకులకు అందించి భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ.. 80 దేశాలలో స్వామికి దేవాలయాలు ఉండడం చాలా ఆనందం అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస స్వామిజీ బోధనలు అన్నారు. గత 30 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఎన్నో రకాల చిత్రాలను ఎన్నో విధాలుగా చిత్రించానన్నారు. ఆ చిత్రం ద్వారా ప్రపంచాన్ని ఒక గొప్ప సందేశాన్ని రామకోటి సంస్థ తెలియజేస్తుందన్నారు.
భగవంతుని సేవే పరమావధిగా భావించిన రామకోటి రామరాజు మరెన్నో దైవ చిత్రాలకు తన కలం ద్వారా ప్రాణం పోయనున్నాడు.
Edupayala | భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర
Guwahati Test | ముతుస్వామి సూపర్ సెంచరీ.. నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికాను కూల్చిన కుల్దీప్
Vivek Venkataswamy | నర్సాపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు : మంత్రి వివేక్ వెంకటస్వామి