Potholes | రాయపోల్, జులై 09 : నడిరోడ్డుపై గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షానికి ఆర్అండ్బీ రోడ్డు అస్తవ్యస్థంగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువైపోయాడు.
నడిరోడ్డుపై గుంతలు పూడ్చివేయాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. దౌల్తాబాద్ నుంచి రాయపోల్ మీదుగా గజ్వేల్ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు రాయపోల్ బస్టాండ్ వద్ద రోడ్డు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. సంవత్సరం గడుస్తున్నా అధికారులు ఈ రోడ్డు మరమ్మతు పనులు చేయడం లేదు. దీంతో నిత్యం పెద్ద వాహనాలు చిన్న చిన్న వాహనాలు వస్తూ పోతుంటాయి.
వర్షానికి గుంతల్లో నీరు చేరి అటువైపు వెళ్తున్న వాహనాలు గుంతలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆర్అండ్బీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం వలన రోడ్డుపై గుంతలు ఏర్పడినప్పటికీ వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అధికారులు అందుబాటులో లేకుండా పోయారని మండల కేంద్ర వాసులు పేర్కొంటున్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం