Manthoor | రాయపోల్, డిసెంబర్ 18 : పేద కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. పదవి ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యన ఉంటున్నామని కో ఆప్షన్ సభ్యులు, మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్
గ్రామంలో గుండెపోటుతో సుదర్శన్ మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పర్వేజ్ అహ్మద్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారికి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా శ్రేయస్సే లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో పేదలకు సహాయం అందించి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు.
తనను గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకున్న మంతూర్ గ్రామస్తుల రుణం తీర్చుకోనిలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సంతోష్, బీఆర్ఎస్ నాయకులు బాగిరెడ్డి పాల్గొన్నారు.
Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!