Professor Sai baba | గజ్వేల్, అక్టోబర్ 13: దళిత అదివాసి పీడిత ప్రజల హక్కుల కొసం పోరాడిన పాపానికి, చేయని నేరానికి తొమ్మిది సంవత్సరాల పాటు జైలులో నిర్బంధించి అనారోగ్యానికి కారణమై.. సాయిబాబా మరణించి సంవత్సరం పూర్తయిన సందర్బంగా గజ్వేల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నాడు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి డీబీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించటం జరిగింది.
ఈ సందర్బంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మాట్లాడుతూ.. ఆదివాసి, గిరిజనుల కోసం పొరాడిన పాపానికి 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను సంవత్సరాల తరబడి ఒక చిన్న గదిలో ఉంచి సరైన తిండిపెట్టకుండా, కప్పుకొవడానికి దుప్పటి కుడా ఇవ్వకుండా నాలుగు గోడల మద్య నరకయాతన పెట్టింది రాజ్యం అన్నారు.
అత్యంత పేదరికంలో తెలుగు గడ్డమీద పుట్టిన ప్రొపెసెర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి వేల మందికి హితొపదేశం చేసిన ప్రోపెసర్ ను చూసి ఓర్వలేక రాజ్యం కుట్రపన్ని కటకటాల పాలుచేసిందన్నారు.
చనిపొయే ముందు నిరాదర కేసు అని సుప్రీం కొర్టు తేల్చిందన్నారు. ఆయన సేవలు సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాటం చేశాడన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు మైస స్వామి, దళిత మాజీ ఉపసర్పంచ్ రాజ్ కుమార్, డీడీఎఫ్ మండల అధ్యక్షులు ఉషగారి చంద్రం,క్యాసారం చంద్రం,సల్లా ఎల్లం,కాయితి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్