Poshan Pakhwada | కొమురవెల్లి, ఏప్రిల్ 21 : చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీడీపీవో రమాదేవి అన్నారు. ఇవాళ మండలంలోని ఐనాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతీ రోజు తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. దీంతో రక్తవృద్ధి ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెరుగడంతోపాటు జీవక్రీయ మెరుగు పర్చడంతో శరీరం సమర్ధవంతగా పనిచేస్తుందన్నారు.
అనంతరం జైన నరేశ్ సహకారంతో గర్భిణీలకు సీమంతం నిర్వహించడంతోపాటు చిన్నారులకు అన్న ప్రసాన, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉమాదేవి, మెడికల్ ఆఫీసర్ హరిత, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం