Kanuvippu | రాయపోల్, జూన్ 11 : రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో పొలీసుల ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోల్ ఎస్సై రఘుపతి మాట్లాడుతూ.. గ్రామంలో మరియు మండల కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఉంటే ప్రజలకు మరింత భద్రత ఉంటుందని తెలిపారు.
గ్రామంలోకి ఎవరు వస్తున్నారు.. ఎవరు పోతున్నారు.. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా..? లేదా గ్రామంలో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఎవరు తప్పు చేశారు..? ఏం జరిగింది..? తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాలలో దొంగలు దొంగతనం చేయడానికి భయపడతారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలన్నారు. త్రిబుల్ రైడింగ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ రాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్, వితౌట్ ఆర్సీ, వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్ పై ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్‌లో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వాహనదారుల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
యుక్త వయసులో ఉన్న యువతీ యువకులపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. స్కూలుకు వెళుతున్నారా..? కాలేజీకి వెళుతున్నారా..? ఇంకెక్కడైనా తిరుగుతున్నారా..? నిఘా ఉంచడం చాలా ముఖ్యమన్నారు. ఆశ, భయము, మనవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దు, అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు
ఆన్లైన్ గేమ్స్ ఆడి మీ కుటుంబాలను రోడ్డున పడేయొద్దు..
నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. మంచి బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు కొనాలని సూచించారు. నకిలీ విత్తనాలు పురుగుల మందులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూఢ నమ్మకాలు, చేత బడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుగ్మతల గురించి సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు రవి, రవీందర్, ఎల్లయ్య, తిరుమలయ్య, బాబాయి కాంతి కుమార్, రవీందర్ నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్