Farooq Hussain | రాయపోల్, సెప్టెంబర్ 27 : పేదలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తానని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా 20 మంది పేదలకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవకే అంకితమైనట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలతో 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. తనకు ఓనమాలు నేర్పిన దుబ్బాక ప్రజలను ఇప్పుడు మర్చిపోనని గుర్తు చేశారు.
ప్రతీ మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటున్నామని.. పండుగలకు కులమతాలకు అతీతంగా తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని.. ఇందులో భాగంగానే తాను 30 సంవత్సరాల నుంచి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు ఆపద వస్తే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి చేరుకొని వారి కుటుంబాలను పరామర్శిస్తున్నట్లు గుర్తు చేశారు. తాను నిత్యం గ్రామాల్లో పర్యటిస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని.. ఇంట్లో ఉండడం కన్నా ప్రజల మధ్యన ఉంటే మంచి ఆరోగ్యంగా ఉంటామన్నారు. భవిష్యత్తులో తాను పేదలకు అండగా ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు. అయిన వెంటనే మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్. మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి. నాయకులు బాగిరెడ్డి, ఉమ్మడి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మంజుర్ తదితరులు పాల్గొన్నారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి