Ganesh Utsavalu | తొగుట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవికాంత్ రావు ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ లతీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలన్నారు. గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతిని తీసుకోవాలని సూచించారు.
గణేష్ మండపాల పోర్టల్‌లో ఆర్గనైజర్ల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలని సూచించారు. ప్రతీ మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సూచించిన విధంగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్లు తప్పకుండా 11 రోజులు ఉండాలని అన్నారు. కచ్చితంగా 11 రోజులలో వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలని, ప్రతీ ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనంలో అనుభవజ్ఞులైన వారు మాత్రమే పాల్గొని చెరువులలో నిమజ్జనం చేయాలని సూచనలు చేశారు. వినాయక మండపాలకు మద్యం సేవించి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుల్స్ పరమేశ్వర్, భరత్, నాగరాజు, బాలకృష్ణ, ఉమ, మానస మండలంలోని వివిధ గ్రామాల గణపతి మండపాల నిర్వాహకులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Mancherial | 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
MLA Gaddam Vinod | మద్యం మత్తులో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వినోద్ అనుచరులు, పీఏల హల్చల్.. వీడియో
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు