నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకులు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఊరు, వాడా సంబురాలు జరుగగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేక్‌లు కటిచేసి, మిఠాయిలు పంచుతూ సంబురాలు చేసుకున్నారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రైతులు పొలాల్లో వేడుకలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలతో సందడి వాతావరణం నెలకొన్నది.
– ఆదిలాబాద్/నిర్మల్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ)