స్వరాష్ట్ర సాధకుడు.. జనహృదయ నేత.. బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగలా జరుపుకొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అన్నదానం, దుస్తులు, పండ్లు, మొక్కల పంపిణీ వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానాలు చేశారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి అభిమానం చాటుకున్నారు. పట్టణాల్లోని చౌరస్తాలు, గ్రామాల కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, నేతల క్యాంపు ఆఫీసులు, ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలలు, దేవాలయాలు.. ఇలా ఎక్కడ చూసినా ‘జయహో కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, తమ ప్రియతమ నేత నిండు నూరేళ్లూ వర్ధిళ్లాలని కోరుకున్నారు.

వేములవాడలో కోడె మొక్కు చెల్లించుకుంటున్న కోలేటి దామోదర్

కరీంనగర్: తెలంగాణ చౌక్‌లో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, నగరాధ్యక్షుడు చల్లా హరిశంకర్

సిరిసిల్ల: నేతన్న విగ్రహం వద్ద నిర్వహించిన కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావుకు కేక్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి

జగిత్యాల: టవర్‌సర్కిల్‌లో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్సీ ఎల్ రమణ

తిమ్మాపూర్: అల్గునూరులో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
జగిత్యాల: ప్రభుత్వ దవాఖానలో బాలింతకు పండ్లు పంపిణీ చేస్తున్న జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి
రామగిరి: సింగరేణి ఆర్జీ-3 బొగ్గు గనిపై కేక్ కట్ చేస్తున్న టీబీజీకేఎస్ నాయకులు
కమాన్‌చౌరస్తా: శాతవాహన యూనివర్సిటీ గేట్ ఎదుట నినదిస్తున్న విద్యార్థులు
బోయినపల్లి రూరల్: కేక్ కట్ చేస్తున్న మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, నాయకులు

మల్యాల: కొండగట్టు దిగువన కేక్ కట్ చేస్థున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

గోదావరిఖని: దవాఖానలో రక్తదానం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త, పక్కన మాజీ ఎమ్మెల్యే చందర్
పెద్దపల్లి కమాన్: అంబేద్కర్ విగ్రహం ఎదుట కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నాయకులు

సిరిసిల్ల: ప్రధాన దవాఖానలో బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ