ఆదిలాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) ః ఇండస్ టవర్స్, పింకిస్ సేవలు అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ సంస్థలు సీఎస్ఆర్ కార్యక్రమం కింద బాలికల గౌరవాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇండస్ టవర్స్ నారి సమ్మాన్ ప్రొగ్రామ్‌లో భాగంగా బాలికల ఆరోగ్యం పెరుగుదలకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ టవర్స్ లిమిటెడ్ సీవోవో తేజెందర్ కల్రా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో 40 పాఠశాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 35 పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో 20,232 ప్యాడ్ ప్యాకెట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 9,582 ప్యాడ్ పాకేట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,77,500, ఆసిఫాబాద్ జిల్లాలో 85,430 శానిటరీ ప్యాడ్లను నిరంతరం సరఫరా చేస్తామన్నారు. ఇండస్ టవర్స్ లిమిటెడ్ దేశంలో నిస్క్రియాత్మక, మౌలిక సదుపాయాల ప్రముఖ ప్రొవైడర్‌గా నిలిచి వివిధ మొబైల్ ఆపరేటర్ల కోసం టెలికం టవర్ల, కమ్యూనికేషన్ నిర్మాణాలను అమలు చేస్తుందని, దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.