Indiramma Houses | నర్సాపూర్, జూన్ 17 : పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ఎంపిక చేసిన 5వ వార్డుకు ఆరు ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే మంజూరు చేయడం ఏంటని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగసాని సురేశ్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపల్ 5వ వార్డులో 80 శాతం సర్వే పూర్తి అయ్యాక గతంలో కాంగ్రెస్ నాయకులు సర్వేను నిలిపివేశారని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా.. రెండు నెలల తర్వాత సర్వే చేపట్టి 45 నుండి 50 మందితో ఫైనల్ జాబితాను సిద్దం చేసి కలెక్టర్‌కు పంపించడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా గత రెండు రోజుల నుండి మిగతా 15 వార్డుల్లో 40 నుండి 60 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారని, కానీ 5వ వార్డులో 6 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ కక్షా రాజకీయాలేంటోనని కాంగ్రెస్ నాయకులను సూటిగా అడుగుతున్నానన్నారు. రాజకీయ కక్ష ఉంటే పార్టీలు పార్టీలు చూసుకోవాలి గాని పేద ప్రజలపై చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లను రాసుకొని ఇందిరమ్మ ఇండ్లను మేమిస్తున్నామని చెప్పడం ఇదేం రాజకీయమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబితాను సిద్దం చేసి పేద ప్రజలను మోసం చేయడం సరికాదని ఆక్రోశించారు. కాంగ్రెస్ పార్టీ దొంగ రాజకీయాలు చేసి ప్రజలను అయోమయం చేయవద్దని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసిడింగ్లు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇవ్వడం ఏంటని, ఇదేమైనా అధికారిక కార్యక్రమమా….లేక పార్టీ కార్యక్రమమా అని మండిపడ్డారు. రాజకీయం చేయడం మీకే రాదని మాక్కూడా తెలుసని చురకలంటించారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా