Oil balls | మద్దూరు (ధూళిమిట్ట), జూలై 02 : దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్ తెలిపారు. బుధవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగు గుంతలు, నిల్వ ఉన్న ప్రాంతాలలో పంచాయతీ సిబ్బంది ఆయిల్బాల్స్ను వదిలివేశారు.
ఈ సందర్భంగా మాధవ్‌జాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై నీరు నిల్వ ఉంటుందని, అదే విధంగా మురుగు కాల్వలలో మురుగునీరు ఉండడం వల్ల దోమలు వాటిని ఆవాసంగా మలుచుకోనున్నట్లు తెలిపారు. దోమల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేకంగా ఊక, ఇంజన్ ఆయిల్‌తో ఆయిల్బాల్లు తయారు చేసి నిల్వ ఉన్న నీటిలో వదిలి వేయడం వల్ల లార్వా దశలోనే దోమలు మృతి చెందనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య