Congress Govt | చేర్యాల, జూలై 17 : కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి కక్ష్య సాధింపులు చేయడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ క్లస్టర్ ఇంచార్జీలు ముస్త్యాల నాగేశ్వర్రావు, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, బూరగోని తిరుపతిగౌడ్ అన్నారు. చేర్యాల మండలంలోని అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాల్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ స్ధానిక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏడారిగా మార్చారన్నారు. వర్షాలు పడక రైతులు బాధపడుతుంటే కనీసం రైతుల గురించి పట్టించుకోకుండా గోదావరి జలాలు రిజర్వాయర్లకు పంపింగ్ చేయడం లేదన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ సమావేశాల్లో మాజీ ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, ముస్త్యాల బాల్‌నర్సయ్య, గ్రామశాఖల అధ్యక్షులు ఏ వెంకటకృష్ణారెడ్డి, పేర్ని రాజు, నాయకులు మధుసూధన్‌రెడ్డి, ఎస్.తిరుపతి, ఓరుగంటి అంజయ్య, ఓరుగంటి శంకర్ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం