రంగారెడ్డి, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య మరోమారు వాయిదా పడింది. ఉదయం 11 గంటల్లోపే బీఆర్ఎస్-13 మంది, కాంగ్రెస్-8 మంది, బీజేపీ -1, స్వతంత్ర-1 కౌన్సిలర్లు సమావేశ మందిరంలోకి వెళ్లారు. సోమవారం మీటింగ్‌కు రాని 19వ వా ర్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా యాదగిరితో ఎన్నికల అధికారి, ఆర్డీవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపేందుకు అధికారులు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్లు సమావేశ మందిరంలో గొడవకు దిగారు. ఎన్నిక నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను చేతులెత్తే విధానం కాకుండా సీక్రెట్‌గా జరపాలని డిమాండ్ చేయడంతో వారిని పోలీసులు బయటికి పంపించేశారు.
అనంతరం బీఆర్ఎస్ 7వ వార్డు కౌన్సిలర్ టేకుల సుదర్శన్‌రెడ్డిని చైర్మన్‌గా ప్రతిపాదిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక బీజేపీ, మరో స్వతంత్ర అభ్యర్థి చేతులెత్తారు. ఆ వెనువెంటనే హైకోర్టు నుంచి ఈ ఎన్నికను నిలిపేయాలని ఎన్నికల అధికారికి ఆదేశాలు రావటంతో ఈ ప్రక్రియను నిలిపేసి.. చైర్మన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కేవలం ఫోన్ ద్వారా వచ్చిన సమాచారంతోనే ఎన్నిక ప్రక్రియను నిలిపివేసి కోర్టు నుంచి ఆర్డర్‌కాపీ వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పడంతో కౌన్సిలర్లతోపాటు ఆయా పార్టీల నాయకులు, మీడియా, పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసినా ఎన్నిక నిర్వహించలేదు. దీంతో మరోమారు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. కోర్టు ఆర్డర్ కాపీ చూపాలని.. లేదంటే ఎన్నికను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అడ్డదారుల్లో అధికారాన్ని పొందేందుకు కుట్ర..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పూర్తిస్థాయి మెజార్టీ ఇచ్చినా కాంగ్రెస్ నాయకులు అడ్డదారుల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆమనగల్లు, మొయినాబాద్ల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార పార్టీ అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కిచుకుని ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసింది. ఇబ్రహీంపట్నంలోనూ పీఠాన్ని పొందేందుకు అనేక అడ్డదారులు తొక్కుతున్నది. చివరకు బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబసభ్యులతో కుమ్మక్కై కోర్టుకెళ్లి ఎన్నికను ఆపింది. సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
ప్రజాస్వామ్యం ఖూనీ
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇబ్ర హీంపట్నం మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా.. ఆయన వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుగకుండా అడ్డుపడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ ఉన్నది. అయినా తమ పార్టీకే చెందిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుటుంబానికి లేనిపోని తప్పుడు సలహాలిచ్చి.. వారితో కోర్టులో పిటిషన్ వేయించారు. మంగళవారం కౌన్సిలర్ యాదగిరి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ సమావేశానికెళ్లి చైర్మన్ ఎన్నికలో పాల్గొన్నారు. ఎన్నిక నిర్వహించొద్దని కోర్టు స్టే ఇచ్చిందని ఉదయం నుంచి హైడ్రామా సృష్టించారు. రాత్రి 6 గంటల వరకూ కోర్టుస్టేకు సంబంధించిన కాపీలు రాలేదు. ఎమ్మెల్యే రంగారెడ్డి తీరును ప్రజల్లో ఎండగడుతాం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
భారీ బందోబస్తు
కాగా, సోమవారం జరగాల్సిన మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆందోళనతో ఎన్నికల అధికారి, ఆర్డీవో మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు ఇబ్రహీంపట్నం పరిసరాలతోపాటు మున్సిపల్ కార్యాలయ ప్రాంతాల్లో అడిషనల్ సీపీ, డీసీపీ నారాయణరెడ్డితోపాటు ఐదుగురు ఏసీపీలతో దాదాపు వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోర్టు తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే నిర్వహిస్తామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో, మున్సిపల్ ఎన్నికల అధికారి అనంతరెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వాటిని నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు రాగా వెంటనే నిలిపేశామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని పోలీసులు కోర్టులో హాజరపర్చేందుకు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
వ్యవస్థలను అడ్డం పెట్టుకుని..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 15 మంది కౌన్సిలర్లతో చైర్మన్, వైస్‌చైర్మన్ అయ్యేందుకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా కాంగ్రెస్‌పార్టీ, ఎమ్మెల్యే రంగారెడ్డి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మరోమారు ఎన్నికను వాయిదా వేయించడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.