Road Potholes | రాయపోల్, జులై 23 : చిన్నపాటి వర్షాలకే రోడ్డంతా చిత్తడిగా మారుతుంది. అసలే ఇరుకైన రోడ్డు, ఆపై వర్షాలు కురిస్తే రోడ్డుపై నడవాలంటే స్థానికులు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు.. అభివృద్ధి జరగడం లేదు.
బస్టాండ్ నుంచి గ్రామంలోని జెండా వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే వాహనాలు తిరిగితే పక్క నుంచి వస్తున్న వ్యక్తులపై నీళ్లు పడుతున్నాయి. గుంతల మయంగా మారిన ఈ రోడ్డును మరమ్మతు చేయాలని గతంలో గ్రామస్తులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో మండల కేంద్రవాసులు ఆందోళన గురవుతున్నారు.
బస్టాండ్ నుంచి గ్రామంలోకి రావాలంటే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని జెండా వద్ద సెంట్రల్ బ్యాంక్ ఉండడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల మయంగా ఉన్న రోడ్డును బాగు చేయాలని మండల కేంద్ర వాసులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని. ప్రభుత్వాలు మారిన రోడ్డు మాత్రం బాగుపడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని అన్ని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించడంతోపాటు మురికి కాలువలు నిర్మించారు. కానీ బస్టాండ్ నుంచి జెండా వరకు రోడ్డు గుంతలమయంగా ఉండడంతోపాటు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారడంతో స్థానికులు నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మతు పనులను చేపట్టి ప్రజల సమస్యలను తీర్చాలని స్థానికులు, మండల ప్రజలు కోరుతున్నారు.
Vidya Balan | కొత్తగా తల్లి అయిన వారికి తక్కువ పని గంటలుండాలి : విద్యాబాలన్
Boney Kapoor | శ్రీదేవి భర్తలో ఇంత చేంజ్ ఏంటి..జిమ్‌కే వెళ్లకుండా 25 కేజీలు తగ్గిన బోనీ కపూర్