Janasena MLC Jayamangala Venkata ramana | పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు’ చిత్రం విజయవంతం కావడానికి జనసేన కార్యకర్తలందరూ కృషి చేయాలని జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లాభాపేక్షతో సినిమాలు చేయరని.. ‘హరిహర వీరమల్లు’ అనేది ఒక చారిత్రాత్మక చిత్రమని, ఈ సినిమాలోని సందేశాన్ని జనసేన కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. అంతేగాకుండా జులై 23వ తేదీన రాత్రి జరిగే ప్రీమియర్ షోతో పాటు, జులై 24వ తేదీన టిక్కెట్లు దొరకని అభిమానులకు మనం తగిన సౌకర్యాలను కల్పించాలంటూ వెంకటరమణ తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ చేయడానికి జనసేన కార్యకర్తలు అందరూ కష్టపడాలి
కార్యకర్తలను ఆదేశించిన జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లాభాల కోసం సినిమాలు చేయలేదు
హరిహర వీరమల్లు అనేది ఒక చారిత్రాత్మక సినిమా, ఈ సినిమాలోని సందేశాన్ని జనసేన కార్యకర్తలు ప్రజలకు… pic.twitter.com/yU6hx3y6ze
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2025