Bollywood Working Hours | సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి విద్యాబాలన్ ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా.. ఇటీవల నటి దీపికా పదుకొనే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాల మధ్య ‘స్పిరిట్’ సినిమా విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో, విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ.. పరిశ్రమలో కొత్తగా తల్లి అయిన హీరోయిన్లకు లేదా ఇతర రంగాలలో చేసే ఆడవారికి సౌకర్యవంతమైన, తక్కువ పని గంటలు ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనివలన తల్లి బిడ్డతో గడపడంతో పాటు తనను తాను మేనేజ్ చేసుకుంటుందని విద్యా చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల పరిశ్రమలో తక్కువ పనిగంటలు. అనుకూలమైన వర్కింగ్ అవర్స్ కావాలని కోరుతున్నారు. ఇది కూడా సరైనదే అని అనుకుంటున్నాను. అయితే నా విషయంలో నేను చేసే సినిమాలకు, ఎనిమిది గంటలు మాత్రమే షూట్ చేయలేము. నేను ఇప్పుడు తల్లిని కాదు కాబట్టి, నాకు 12 గంటల షిఫ్ట్ చేయడానికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ షూటింగ్ చేసిన నేను జాయిన్ అవుతానంటూ విద్యా ఇంటర్వ్యూలో తెలిపింది.