Boney Kapoor | శ్రీదేవి భర్తలో ఇంత చేంజ్ ఏంటి..జిమ్‌కే వెళ్లకుండా 25 కేజీలు తగ్గిన బోనీ కపూర్
Boney Kapoor | బాలీవుడ్ సీనియర్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన న్యూ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు భారీ ఖాయంతో కనిపించిన ఆయన, ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్‌గా మారిపోయారు. ఏకంగా 25 కేజీల బరువు తగ్గడం వెనక తన కఠినమైన ఆహార నియమాలే కారణమని బోనీ తెలిపారు.
Boney Kapoor | బాలీవుడ్ సీనియర్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన న్యూ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు భారీ ఖాయంతో కనిపించిన ఆయన, ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్‌గా మారిపోయారు. ఏకంగా 25 కేజీల బరువు తగ్గడం వెనక తన కఠినమైన ఆహార నియమాలే కారణమని బోనీ తెలిపారు. ఈ మార్పు చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇతను బోనీ కపూరేనా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఆర్. మాధవన్ తరహాలోనే బోనీ కూడా జిమ్‌కు వెళ్లకుండా కేవలం డైట్‌తోనే బరువు తగ్గినవారిలో ఒకరిగా నిలిచారు.
మాధవన్ ఆ మధ్య మాట్లాడుతూ.. సరైన ఆహార నియమాలతో బరువు తగ్గొచ్చని చెప్పారు. ఇప్పుడు దానిని బోనీ చేసి చూపించారు. ఇక బోనీ కపూర్ డైట్ ప్లాన్ గురించి చెబుతూ.. ఉదయం అల్పాహారంలో పండ్లు, పండ్ల రసాలు, జవర్ రోటీ మాత్రమే తీసుకున్నాను. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో సలాడ్లు, సూప్‌లు వంటి తేలికపాటి ఆహారం తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారమే తీసుకున్నానన్నారు. అనవసరమైన విందులు, ఫంక్షన్స్ వంటివి పూర్తిగా వదిలేశానని చెప్పారు. ఈ మార్పు వెనక ఎలాంటి మాయ, ప్రత్యేక ట్రైనింగ్ ఏమి లేదు… కేవలం డెడికేషన్, ఆత్మనిబ్బరం మాత్రమే ఉన్నాయి అంటూ బోనీ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా సహజమైన మార్పు అని, దీనికోసం జిమ్ అవసరం లేదని తెలిపారు.
ఇప్పటికే బోనీ కొత్త లుక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది ఆయన డిసిప్లిన్‌ను మెచ్చుకుంటున్నారు. అంత వయస్సులో ఇటువంటి ఫిట్నెస్ సాధించటం నిజంగా గొప్ప విషయం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. బోనీ కపూర్ డైట్ మార్గం ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారింది. జిమ్కె వెళ్లలేని వారు సరైన ఆహార నియమాలతో కూడా బరువు తగ్గవచ్చని ఇది మరోసారి రుజువైంది. కొద్ది రోజుల క్రితం హీరో శింబు కూడా సినిమాలోని పాత్ర కోసం దాదాపు పది కేజీల బరువు తగ్గిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

