Rayapol | ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు.
రాయపోల్ ఎప్రిల్ 24 : ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల పాలనకు స్థానిక సంస్థలు ఎన్నికలను పంచాయతీ రాజ్ వ్యవస్థగా పేర్కొనడం జరిగిందన్నారు.
గ్రామీణ స్వయం పాలనకు పునాది పల్లెలను శక్తివంతం చేయడంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అన్నారు. గ్రామాలు పచ్చదనం ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటే గ్రామం మరింత అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధులను గ్రామాభివృద్ధికి సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ముందుకు రావాలన్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తున్నామని. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత. మురికి కాల్వల నిర్మాణం, సిసి రోడ్లు, రోడ్ల విస్తరణ, విదీపాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలంలో రాయపోల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కాగా మండలంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ల అధ్యక్షతన పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో . ఉప సర్పంచ్ హనుమంతు రాజు, పంచాయతీ కార్యదర్శి ఎంపీ ఓ శివకుమార్, పంచాయతీ వార్డు సభ్యులు గౌరీ గారి పరుశురాములు, జోగు నరసింహులు.
మాసంపల్లి యాదగిరి, సమర్ రాములు ఆశ వర్కర్లు . అంగన్వాడి టీచర్లు. వెలుగు సిబ్బంది. గ్రామ ప్రజలు యువకులు తదితరు పాల్గొన్నారు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

