Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రోడ్డుపై ఉన్న ఆవులను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఎనిమిదిమంది కూలీలు మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన భిండ్-గ్వాలియర్ జాతీయ రహదారిపై చిమ్కా గ్రామం సమీపంలో రాత్రి సుమారు 1 గంటకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ గ్రామస్తులు గ్వాలియర్‌లో వరి నాట్లు వేసే పని పూర్తి చేసుకుని తిరిగి తమ గ్రామానికి వెళ్తున్నారు.
కూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ రహదారిపై ఉన్న ఉన్న పశువులను తప్పించబోయే క్రమంలో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కును ఢీకొట్టడంతో (head-on collision) ఎనిమిది మంది మరణించారని గోహద్ చౌరాహా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రామ్‌నరేశ్ యాదవ్ తెలిపారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ వెంటనే గోహద్‌లోని హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు.
STORY | 8 labourers killed, over 30 injured as pick-up vehicle collides with truck in MP’s Bhind
Eight labourers were killed and 32 others injured after their pick-up vehicle collided with a truck in Madhya Pradesh’s Bhind district in the wee hours of Tuesday, police said.… https://t.co/fSQbO9zJDp
— Press Trust of India (@PTI_News) August 18, 2026