హైదరాబాద్,సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం ఎ మ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్రెడ్డి, నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిని ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం అధికారికంగా వెల్లడించారు.