Sabarimala | మోహన్ లాల్ సినిమా వివాదం.. శబరిమలలో షూటింగ్లను నిషేధించిన ప్రభుత్వం!
Mohanlal Movie | ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో సాధారణ చలనచిత్రాల షూటింగ్లను అనుమతించేది లేదని కేరళ దేవదాయశాఖ శాఖ మంత్రి కె. మురళీధరన్ స్పష్టం చేశారు.
Mohanlal Movie | ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో సాధారణ చలనచిత్రాల షూటింగ్లను అనుమతించేది లేదని కేరళ దేవదాయశాఖ శాఖ మంత్రి కె. మురళీధరన్ స్పష్టం చేశారు. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్లాల్ హీరోగా, తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ చిత్రానికి శబరిమలలో షూటింగ్ నిర్వహించుకోవడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతి ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. పంబా నుండి సన్నిధానం వరకు షూటింగ్ జరుపుకోవడానికి కఠిన నిబంధనలతో కూడిన అనుమతులు జారీ అయినప్పటికీ, అటవీ శాఖ (Forest Department) ఇందుకు సమ్మతించకపోవడంతో ఆ షెడ్యూల్ నిలిచిపోయింది.
అయితే ఈ పరిణామాలపై స్పందించిన మంత్రి మురళీధరన్, ఆలయాల్లో సాధారణ సినిమాల షూటింగ్లకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని తేల్చిచెప్పారు. కేవలం స్వామి అయ్యప్పకు సంబంధించిన భక్తి చిత్రాలకు మరియు మతపరమైన సినిమాలకు మాత్రమే ఆలయ పరిసరాల్లో మినహాయింపు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. దేవుని సన్నిధిని సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్గా మార్చలేమని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మీరా జాస్మిన్ నటిస్తుండగా, లాలూ అలెక్స్, మనోజ్ కె. జయన్, జగ్దీష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా మరోవైపు పవిత్రమైన పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడేలా ప్రభుత్వాలు మరియు బోర్డులు కఠిన నిబంధనలు అమలు చేయాలని భక్తుల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

