Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. నర్సంపేటలో(Narsampet) దివంగత తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం రెండో సారి కూల్చివేసిన సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగకుండా పోలీసులు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ కూడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి తో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు.
కాగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు (removed statue) తొలగించారు. నర్సంపేటలోని మెడికల్ కాలేజీ ఎదరుగా ఉన్న విగ్రహాన్ని అర్దరాత్రి భారీ బందోబస్తు మధ్య పోలీసులు తొలగించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరని అనుమతించడం లేదు. చివరికి పోలీసులకు కూడా సెల్ఫోన్ అనుమతివ్వకుండా కట్టడి చేశారు.