Stoppers| రాయపోల్, నవంబర్ 03 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మూలమలుపు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తకు రాయపోల్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మూల మలుపుల వద్ద నాలుగు స్టాపర్లను ఏర్పాటు చేశారు. ఈ మూల మలుపు వద్ద ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా సంబంధిత ఆర్అండ్బీ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో మూలమలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది గమనించిన పోలీసులు ప్రస్తుతం మూల మాలుపు ప్రమాదాలు జరగకుండా స్టాపర్లను ఏర్పాటు చేశారు.
సంబంధిత శాఖ అధికారులు మేల్కొని మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Penpahad : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్ఐ గోపికృష్ణ
Hanumakonda | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి ‘లక్ష తులసీ దళార్చన’