Devunipalli Jathara | పెద్దపల్లి రూరల్, నవంబర్ 3 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలో దేవునిపల్లి గ్రామాన్ని సంబంధిత అధికారులు, పోలీసులతో కలిసి సోమవారం సందర్శించి దేవాలయ పరిసరాలను పరిశీలించారు.
జాతరలో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన రహదారుల రూట్ మ్యాప్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన బందోబస్తు చేపడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో ముద్దసాని శంకరయ్య, ట్రాఫీక్ సీఐ అనిల్ కుమార్ , ఎస్సైలు మల్లేష్ , సహదేవ్ సింగ్, రాజవర్ధన్, మాజీ ఉపసర్పంచ్ లు తలారి స్వప్న సాగర్, బొక్కల సంతోష్, దేవాలయ కమిటి అధ్యక్షుడు బొడ్డుపల్లి సదయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.