Anil Kumble : ఐపీఎల్ 19వ సీజన్ తొలి దశకు గడుపు సమీపిస్తోంది. మార్చి 28వ తేదీన అట్టహాసంగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గత సీజన్ తప్పులను పునరావృతం చేయొద్దని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. నిరుడు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) సైతం గొప్పగా పుంజుకోవాలనే కసితో ఉంది. అయితే.. ఆ ఫ్రాంచైజీ నిరుడు పెద్ద పొరపాటు చేసిందని భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే (Anil Kumble) అన్నాడు. ట్రోఫీ కట్టబెట్టిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)ను వదిలేసి కోల్‌కతా పెద్ద తప్పు చేసిందని.. అందుకు భారీ మూల్యం చెల్లించుకుందని కుంబ్లే తెలిపాడు.
పదిహేడో సీజన్లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ 18వ ఎడిషన్‌లో చతికిలపడింది. అజింక్యా రహానే సారథ్యంలో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన కోల్‌కతా ప్లే ఆఫ్స్ ముందే లీగ్ నుంచి నిష్క్రమించింది. దీనికంతటికి శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడమే కారణమని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
“KKR took the wrong decision” – Anil Kumble’s massive statement on three-time winners ahead of IPL 2026 https://t.co/Q8GmkvJFRM pic.twitter.com/hUowLEgExZ
— Sportskeeda (@Sportskeeda) March 14, 2026
‘రెండేళ్ల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుపొందింది. కోల్‌కతా విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ కీలక పాత్ర పోషించారు. కానీ, ఈ ఇద్దరిని కేకేఆర్ వదులుకుంది. ఆ ఫ్రాంచైజీ రిటెన్షన్ విధానంలో నిలకడ లేదు. అయ్యర్, సాల్ట్‌ను వదిలేసి కోల్‌కతా పెద్ద తప్పు చేసింది’ అని కుంబ్లే విమర్శించాడు.
“WRONG DECISION” – ANIL KUMBLE ON SHREYAS IYER.🚨
Kumble said🎙️- KKR made the wrong decision by releasing Shreyas Iyer and Phil Salt after their IPL-winning season, adding that letting key players go can hurt the team’s chances. 🤯 pic.twitter.com/uzeZbzX49U
— PANKAJ (@PANKAJ_7979) March 14, 2026
రహేనే కెప్టెన్సీ గురించి కుంబ్లే మాట్లాడుతూ.. ‘రహానే అనుభవజ్ఞుడైన ఆటగాడు. దేశవాళీలో అతడు ముంబైకి, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథ్యం వహించాడు. కానీ, ఒక్కసారి టైటిల్ గెలవలేదు. ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ను అట్టిపెట్టుకోకపోవడం కోల్‌కతాను వేధిస్తోంది. ఆ జట్టు రిటెన్షన్ విధానం కూడా సహేతుకంగా అనిపించడం లేదు. అలాంటప్పుడు ఆ ఫ్రాంచైజీ ఫేవరెట్ అనిపించుకోదు’ అని కుంబ్లే పేర్కొన్నాడు.
పద్దెనిమిదో సీజన్లో రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్(Punjab Kings) గూటికి చేరిన అయ్యర్ తన మార్క్ కెప్టెన్సీతో జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. కానీ, టైటిల్ పోరులో ఆర్సీబీ ధాటికి నిలువలేక రెండోసారి రన్నరప్‌తోనే పంజాబ్ సరిపెట్టుకుంది.