Nalla Pochamma | రాయపోల్, జులై 28. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టను వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టించారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. రెడ్డి జాగృతి రాష్ట్ర వ్యవస్థాపకుడు బుట్టెంగారి మాధవరెడ్డి హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం అమ్మవారికి ఇంటింటి నుంచి బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు నిర్వహించిన అనంతరం నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెడ్డి సంఘం సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్