TSUTF | రాయపోల్ జులై 09 : ప్రభుత్వ విద్యారంగ పటిష్టతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ
ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి డిమాండ్ చేశారు. బుధవారం సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన ప్రతినిధులతో కలిసి రాయపోల్ మండలంలోని వీరారెడ్డిపల్లి, వీరనగర్, దొడ్లపల్లి, వడ్డేపల్లి,సయ్యద్ నగర్, రామారాం, గొల్లపల్లి, ఉదయపూర్, కొత్తపల్లి రాంసాగర్, ముంగిసపల్లి ఎస్సీ కాలనీ, చిన్న మాసాన్ పల్లి పాఠశాలలను సందర్శించి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట, టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ఎన్రోల్మెంట్ ప్రచారజాత ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యవేక్షణాధికారులు డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవోల ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి పటిష్టమైన తనిఖీ యంత్రంగానీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు టీ శివలింగం, ఎం రవీందర్, రాయపోల్ మండల అధ్యక్షుడు పీ శ్రీధర్, ఉపాధ్యక్షురాలు విజయ తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం