Mobile phones | గజ్వేల్, జూలై 28 : గజ్వేల్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగిలించబడిన 28 సెల్ ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అందజేశారు. గజ్వేల్ లోని ఒక ఫంక్షన్ హాల్లో సోమవారం ఏసీపీ నరసింహులు సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ.. సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, ఎవ్వరైనా దొంగిలించుకపోయినా వెంటనే సీఈఐఆర్ (CEIR) (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)లో డాటా నమోదు చేయాలన్నారు. ఫోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో, మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా.. ఎక్కడైనా పడిపోయినా వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి అనే విషయం పై అవగాహన కల్పించాలన్నారు.
సెల్ ఫోన్లు త్వరగా రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ నరసింహులు అభినందించారు. పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లు రికవరీ చేసి అందించినందుకు ఆనందం వ్యక్తం చేసిన బాధితులు గజ్వేల్ డివిజన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, డివిజన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్