కోడిమ్యాల : జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కుక్కల మధు మృతదేహం ఇరాక్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. కుక్కల మధు ఇరాక్‌లో నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందారు.
అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసిన తర్వాత మృతదేహాన్ని భారత్‌కు తరలించారు. ఇవాళ (బుధవారం) మృతదేహం స్వగ్రామం నల్లగొండకు చేరుకుంది. ఈరోజే అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.