BCs Reservations | తొగుట అక్టోబర్ 10: తొగుట మండల కేంద్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు సమావేశమై 42 శాతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు.
స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామస్థాయి ప్రజా ప్రతినిధుల నుండి ముఖ్యమంత్రి పదవుల వరకు కూడా అగ్రవర్ణాలే అనుభవిస్తున్నారని అన్నారు. జనాభా ప్రతిపాదికను బట్టి అగ్రవర్ణాలకు కూడా 10 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని బీసీ నాయకులు అన్నారు. కొద్ది శాతం ఉన్న అగ్రవర్గాలు 90% ప్రజాప్రతినిధులుగా మీరే అనుభవిస్తున్నారని.. ఇకనుండి అగ్ర వర్గాల ఆటలు చెల్లయని రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం వస్తుందని అన్నారు. అగ్రవర్గాలు బీసీల రిజర్వేషన్ల 42 శాతాన్ని అడ్డుకుంటే రాబోయే రోజుల్లో అగ్రవర్గాలకు పుట్టగతులు ఉండవు అని అన్నారు.
బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అగ్రవర్ణాలకు ఆటలు చెల్లవని..
తెలంగాణ ఉద్యమం కన్నా బీసీల ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటాయని అగ్రవర్ణాలను ప్రతి గ్రామంలో తిరగనియ్యమని బీసీ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ 42 శాతానికి అమలు చేస్తూ బీసీలకు సహకరించాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే అగ్రవర్ణాలకు ఆటలు చెల్లవని కుట్రతో బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో GKSS జిల్లా అధ్యక్షులు పాతుకుల వెంకటేశం, సిరినేని గోవర్ధన్, చిక్కుడు చంద్రం ముదిరాజ్, గొడుగు ఐలయ్య ముదిరాజ్, కురుమ యాదగిరి.ఐలగొండ చంద్రశేఖర్ గౌడ్. తగరం అశోక్. చిక్కుడు బాలమల్లు. ముచ్చర్ల ఆంజనేయులు యాదవ్. ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.
Pending Fees | పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి
Tejashwi Yadav | ఆర్జేడీని గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం.. బీహారీలకు తేజస్వియాదవ్ హామీ
Penpahad : మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు : సీనియర్ సైంటిస్ట్ వెంకటరమణ