Garbage | రాయపోల్, సెప్టెంబర్ 2 : ప్రతీ ఒక్కరు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబూనాయక్ అన్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రాయపోల్, కొత్తపల్లిలో మంగళవారం ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాబూనాయక్ మాట్లాడుతూ మండలంలోని ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సఫాయి కార్మికులకు సూచించారు. రోడ్లపై, వీధుల్లో చెత్తను పారవేయవద్దని.. దాంతో దోమలు, ఈగలు వంటివి వ్యాపించి అంటు వ్యాధులు రావడానికి అవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఇంటి పరిసరప్రాంతాలలో మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు శివకుమార్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత