హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ఉంటున్న ఇద్దరు చిన్నారులను వీడియో కాల్ ద్వారా తల్లితో మాట్లాడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన జంటకు 2015లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు.
అనంతరం దాంపత్య విభేదాలు తలెత్తడంతో పిల్లలను కలిసే అవకాశం ఇవ్వడం లేదంటూ భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిన్నారులను తల్లికి చూపించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేస్తూ.. 12న పిల్లలతో సహా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని వారి తండ్రి భరత్ కుమార్ను హైకోర్టుఆదేశించింది.