నయీంనగర్, ఆగస్టు 1 : వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అనిల్‌కు ఆరేండ్ల క్రితం రజిత(31)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అనిల్ హనుమకొండలోని కృష్ణకాలనీలో కుటుంబంతో నివాసం ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శనివారం రాత్రి అనిల్ తన భార్య రజిత కాళ్లు, చేతులు కట్టేసి, మెడ కోసి హత్య చేశాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.