నిషిన్ : ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్‌కు వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించాడు. సోమవారం జరగాల్సిన భారత్, అఫ్గానిస్థాన్ పోరుతో పాటు పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్ సైతం కనీసం టాస్ కూడా పడకుండానే రైద్దెంది. నగోయాలో చాలారోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసియాలో అత్యుత్తమ జట్ల ఆటను చూద్దామనుకున్న జపాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.
భారత్, అఫ్గాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో నిబంధనల ప్రకారం హయ్యస్ట్ సీడింగ్ కలిగిన టీమిండియా సెమీస్ చేరుకుంది. మరో క్వార్టర్స్‌లోనూ ఇదే నిబంధనతో పాక్ సెమీస్‌కు ప్రవేశించింది. మంగళవారం శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన విజేతతో భారత్ రెండో సెమీస్ ఆడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా వాన వల్ల ఆగిపోతే సెమీస్‌లో భారత ప్రత్యర్థి శ్రీలంక అవుతుంది.