Nano Urea | తొగుట, జులై 28 : తొగుట మండలం ఎరువుల డీలర్లలకు నానో యూరియాపై దుబ్బాక సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య మాట్లాడుతూ.. డీలర్లు అందరూ నానో యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. నానో యూరియా వలన కలిగే లాభాలను వివరించారు.
ఎఫ్పీవో వెంకట్రావుపేట్ డీలర్ మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా రైతులు నానో యూరియాను వాడుతున్నారని.. నానో యూరియా బాగా పని చేస్తుందని తెలిపారు. అదే విదంగా డీలర్లు విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు. డీలర్లు స్టాక్ బోర్డులు పెట్టాలని.. రోజు వారి అమ్మకం రిజిస్టర్ పెట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్