Truck Explosion: బోల్తాపడి పేలిన గ్యాస్ ట్రక్కు.. చిలీలో నలుగురు మృతి
Truck Explosion: లిక్విడ్ గ్యాస్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తాపడింది. దీంతో ఆ వాహనం నుంచి మంటలు వ్యాపించాయి. చిలీలో జరిగిన ఆ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. పేలుడు ఘటనకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శాంటియాగో: చిలీ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. లిక్విడ్ గ్యాస్‌తో వెళ్తున్న ట్రక్కు(Truck Explosion) ప్రమాదానికి గురైంది. దేశ రాజధాని శాంటియాగో హైవేపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. హైవేపై వెళ్తున్న వాహనం తొలుత బోల్తా కొట్టింది, ఆ తర్వాత అది పేలినట్లు అధికారులు చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు అదుపు తప్పి ప్రమాదానికి లోనైంది. దుర్ఘటనలో ట్రక్కు డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు.
ట్రక్కు బోల్తా పడిన తర్వాత ఆ వాహనం నుంచి లిక్విడ్ గ్యాస్ వ్యాపించింది. ఆ రూట్లో వెళ్తున్న వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. పొగ విస్తరిస్తున్న విజువల్ సీసీ కెమెరాలకు చిక్కాయి. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో మంటలు అంటుకున్నాయి. స్థానిక గాస్కో గ్యాస్ కంపెనీ ట్రక్కు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. లిక్విడ్ గ్యాస్ పేలడం వల్ల సుమారు 200 మీటర్ల వరకు మంటలు వ్యాపించాయి. 50 వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం పట్ల దేశాధ్యక్షుడు గాబ్రియల్ బోరిస్ విచారం వ్యక్తం చేశారు.
Tragična nesreča v Čilu 🇨🇱, eksplozija vlačilca cisterne z utekočinjenim plinom.https://t.co/gUc7whnesw pic.twitter.com/mSb1pX9TvV
— Schall_abweiser0002 (@Schallabweiser2) February 20, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

