Rayapol | రాయపోల్ ఫిబ్రవరి 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ గ్రామానికి చెందిన క్రీడాకారుడు పి.సతీశ్ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 18వ తేదీన కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ నెట్ బాల్ పోటీల్లో సతీశ్ కనబరిచి ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా సతీశ్‌ను పీడీ గోవర్దన్ రెడ్డి అభినందించారు. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని సెగ్ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఓయూ తరఫునసతీశ ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు. ప్రస్తుతం సతీశ్ కొంపల్లిలోని లయోలా డిగ్రీ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ సెకండియర్ చదువుతున్నాడు. ఇక సతీశ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఎల్కల్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.