DPO Devakidevi | రాయపోల్, సెప్టెంబర్ 3 : ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి దేవకీ దేవి అన్నారు. బుధవారం రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 14 ఏండ్ల బాలునికి డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని తెలుసుకొని గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పంచాయతీ నిర్వహణతోపాటు పరిశుభ్రతా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డీపీఓ దేవకీదేవి సమస్యలను ఆరా తీశారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల చెత్త పేరుకుపోకుండా శుభ్రత పాటించాలి. మస్కిటో కాయిల్, నెట్లు వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే వ్యాధులు రాకుండా నివారించవచ్చని, పంచాయతీ స్థాయిలో ప్రతి వారంలో ఒకసారి శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
గ్రామంలోని తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారి పరిస్థితులను కూడా డీపీఓ దేవకీదేవి పరిశీలించారు. ప్రజల సహకారంతోనే ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సోమిరెడ్డి, సెక్రటరీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?
SSMB 29 | రాజమౌళి – మహేశ్ బాబు సినిమా.. కెన్యా మసాయి మరా వైపే అందరిచూపు.!
Akshay Kumar | గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్