రాయపోల్ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి అన్నారు. సోమవారం తహసీల్దార్‌కు వికలాంగులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఒంటరి మహిళలు, వితంతువులు, బీడి కార్మికుల పెన్షన్లను పెంచాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వికలాంగుల సంఘం ఉపాధ్యక్షుడు అరికెల సత్తయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంతోష్, లక్ష్మణ్, యాదగిరి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.