Road Journey | హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 12: జాతీయ రహదారి విస్తరణ పనులు వాహనదారులకు నరక యాతనను చూపెడుతున్నాయి. రహదారి పనుల ద్వారా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. హుస్నాబాద్ నుంచి పందిల్లకు వెళ్లే మార్గ మధ్యంలో బ్రిడ్జి పనులు నిర్వహిస్తుండగా.. ఇందుకుగాను ప్రత్యామ్నాయంగా పక్కనే మరో రహదారిని నిర్మించారు.
అయితే మట్టిరోడ్డు దాదాపు అర కిలోమీటర్ వరకు ఉండటంతో ఏదైనా పెద్ద వాహనం వెళితే చాలు ఆ రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా దుమ్ము, ధూళితో నిండిపోయి ప్రమాదాలు జరగడంతోపాటు అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆ మట్టిరోడ్డుపై నీటిని చల్లి దుమ్ము, ధూళీ లేవకుండా చూడాల్సిన సదరు కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా పని చేస్తుండటంతో ఆ రహదారిపై వాహనదారులు నిత్యం నరకయాతన పడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు బ్రిడ్జిపనులు పూర్తిచేసేవరకు దుమ్ము, ధూళీ లేవకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!