MLA Kotha Prabhakarreddy | రాయపోల్ 02 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని మంతూర్ గ్రామానికి చెందిన దండు నర్సయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకొని దండు నర్సయ్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బుధవారం మండల పార్టీ శ్రేణులు బాధిత కుటుంబానికి ఎల్ఓసీని అందజేశారు. దండు నర్సయ్య పేద కుటుంబం కావడంతో చికిత్స కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి ఆసుపత్రి చికిత్సల కోసం తక్షణసాయంగా రూ. 2 లక్షల ఎల్ఓసీ ఇప్పించారు.
కష్టకాలంలో ఉన్న దండు నర్సయ్య కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు పర్వేజ్ అహ్మద్, రాష్ట్ర యువజన నాయకుడు హనుమాండ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రం గౌడ్. మంతూర్ గ్రామ బీఆర్ఏస్ అధ్యక్షుడు సంతోష్, నాయకులు మహేష్, సుధాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య