సిద్దిపేట,మే23 : యాదవ సమాజం శ్రేయస్సుకు శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ నూతన పాలక వర్గం సభ్యులు పాటుపడలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ నూతన పాలక వర్గం ఇటీవల ఎన్నుకున్నారు. పాలక వర్గ సభ్యులు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ ను రూ.2కోట్లతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించుకున్నామన్నారు. యాదవ సమాజానికి ఫంక్షన్ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
నూతన కార్యవర్గం ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యాదవ సమాజంలో ఉండే పేద కుటుంబాలకు, ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు సహాయం అందించడంలో పాలక వర్గం ముందుండాలని సూచించారు. నూతన కార్యవర్గానికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నూతన అధ్యక్షుడు బైరి రాములును, కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించారు.
ఈ కార్య్రకమంలో యాదవ సంఘం సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, ఐలయ్య యాదవ్, గంధం రాజు తదితరులు ఉన్నారు. అలాగే నారాయణ రావు పేట మండలం గ్రురాల గొందిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి వచ్చే నెల 1 వ తేదీ వరకు జరిగే మహంకాళి దేవాలయ ఉత్సవాలకు రావాలని మాజీ హరీశ్‌రావును కోరారు. శ్రుకవారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు ఆహ్వాన ప్రతికను అందజేశారు.