Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ టౌన్ : హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయంలో చండీ హోమం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఎల్లమ్మ జాతర ఉత్సవాల ముగింపులో భాగంగా అమ్మవారికి కట్టిన బాసింగాలను స్థానిక గౌడ కులస్తుల సమక్షంలో ఈవో కిషన్ రావు ఆధ్వర్యంలో ఆలయంలో సమర్పించారు.
జాతర ముగింపు బుధవారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది. భక్తులు అమ్మవారికి పట్నం వేసి ఒడిబియ్యం, చీరసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అందరినీ సురక్షితంగా కాపాడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు చండీ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్నాబాద్, కొత్తకొండ, భద్రకాళి దేవస్థానంకు సంబంధించిన అర్చకులు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు